సీటీమార్’ సినిమాలో హీరో ఎవరు ?
Published on Feb 23, 2018 12:00 pm IST

డైరెక్టర్ హరీష్ శంకర్ నిన్న తన కొత్త సినిమాను ప్రకటించాడు. జవాన్ సినిమా నిర్మాతతో ఒక సినిమా చెయ్యబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ‘సీటీమార్’ టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం దాగుడుమూతలు సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా పూర్తి అయ్యాక సీటిమార్ చిత్రాని తెరకెక్కించబోతున్నాడు.

‘సీటీమార్’ సినిమాలో నటించబోయే హీరో ఎవరు అనే అంశంపై స్పష్టత లేకపోయినా.. చాలా వరుకు బన్ని పేరు వినిపిస్తోంది. బన్నితో గతంలో ‘దువ్వాడ జగన్నాథమ్’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ‘దాగుడుమూతలు’ విషయానికి వస్తే.. శర్వానంద్ , నితిన్ ఈ సినిమాలో నటించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా మే నెల నుండి ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook