బజ్..ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తో నాని సినిమా.?

Published on May 26, 2023 9:36 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తన లాస్ట్ చిత్రం “దసరా” తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అయితే తాను సొంతం చేసుకున్నాడు. మరి నాని ఈ సినిమా తర్వాత తన కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 30వ సినిమాని అయితే కొత్త దర్శకునికి అవకాశం ఇవ్వగా ఈ సినిమా షూటింగ్ అయితే ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా నాని లైనప్ పై అయితే మరింత ఆసక్తికర బజ్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది.

నాని లైనప్ లోకి మళయాళ ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ అయితే వచ్చినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ టాలెంటెడ్ దర్శకుడు తన “దృశ్యం” చిత్రాలతో అయితే ఎలాంటి సెన్సేషన్ ని రేపారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇలాంటి డైరెక్టర్ తో నాని లాంటి ప్రామిసింగ్ నటుడు కొలాబరేట్ అవుతున్నాడు అనే టాక్ మరింత ఆసక్తిగా మారింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :