“పుష్ప” రెండు పార్ట్స్ టోటల్ బడ్జెట్ ఇంతా..?

Published on May 13, 2021 9:00 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం కోసమే రచ్చ నడుస్తుంది. ముఖ్యంగా రెండు పార్ట్స్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. అలాగే మరిన్ని ఆసక్తికర గాసిప్స్ కూడా వినిపించాయి. అలా రెండు పార్టులు గా ఈ చిత్రం ఫిక్స్ కాగా మరి ఆ రెండు చిత్రాలకు ఎంత బడ్జెట్ అవుతుంది అన్న దానిపై మరో బజ్ వినిపిస్తుంది.

మరి దాని ప్రకారం పుష్ప రెండు భాగాలకు కలిపి మొత్తం 200 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందట కానీ 250 కోట్లను దాటకుండా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ భయారీ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :