బాలయ్యతో సి కళ్యాణ్ మరో సినిమా !

బాలయ్యతో సి కళ్యాణ్ మరో సినిమా !

Published on Jun 28, 2021 8:01 AM IST

బాలయ్య బాబు హీరోగా దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాను చేయడానికి సి కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎమోషనల్ డ్రామాతో పాటు పక్కా యాక్షన్ తో సాగే కొత్త నేపథ్యంలో బాలయ్య కోసం దర్శకుడు శ్రీవాస్ ఓ కథ రాసాడట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్య కొత్త సినిమాల పై బాగా ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటికే బాలయ్య, ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య ఆగస్టు కల్లా అఖండను పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాని, ఆ తరువాత దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట బాలయ్య.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు