బాలయ్య సెకండ్ లుక్ గురుంచి చెప్పేసిన సీ కళ్యాణ్

Published on Aug 31, 2019 10:33 pm IST

ఎన్‌టీఆర్ బయోపిక్ తరువాత బాలక్రిష్ణ చేస్తున్న 105వ సినిమాకు కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ బ్యాంకాక్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి ఎలా గ్యాంగ్ స్టర్‌గా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. అయితే ఈ సినిమాలో కూడా బాలయ్య బాబు డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారని సమాచారం.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన బాలయ్య ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని గెటప్‌లో ఫ్రెంచ్ గడ్డంతో, సన్నగా స్టైలిస్‌గా కనిపించడంతో బాలయ్య బాబు చాలా యంగ్‌గా కనిపించి అభిమానులను ఎంతగానో అలరించారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత సీ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా నుంచి త్వరలోనే మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నామని చెబుతూ బాలయ్య పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలలో మరింత సన్నగా ఉన్నాడని, ఆ ఫోటోలలో బాలయ్య మరింత స్టైలిస్‌గా కనిపించబోతున్నాడని కొత్త అప్డేట్‌ని అందించడంతో బాలయ్య సెకండ్ లుక్ ఎలా ఉండబోతుందో అని అభిమానులలో ఇప్పుడు కొత్త కలవరం మొదలైంది.

సంబంధిత సమాచారం :