పాన్ ఇండియా స్టార్స్ గా నిలబడగలరా ?

పాన్ ఇండియా స్టార్స్ గా నిలబడగలరా ?

Published on Apr 9, 2020 7:22 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలందరీ మెయిన్ టార్గెట్ పాన్ ఇండియా మూవీనే. పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని మన స్టార్స్ తెగ ఆశ పడుతున్నారు. ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన టాప్ హీరోలు పాన్ తో తమ స్పాన్ పెంచుకోవాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టేశారు. తాజాగా బన్నీ కూడా పుష్పతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే స్టార్ హీరోలతో పాటు మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న మంచు మనోజ్… ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని పాన్ ఇండియా మూవీగానే తీసుకువస్తున్నాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. ఈ సారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా హిట్ కొడతాడా అనేదే ప్రశ్న.

ఇక తన నటనతో పాటు స్టైల్ పరంగా కూడా మంచి పాపులారిటీని ఫుల్ క్రేజ్ ను తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ ట్రై చేస్తూ ఇంతకుముందెన్నడూ ఏ తెలుగు హీరో కనిపించని విధంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుండటంతో విజయ్ క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా గట్టిగానే వినిపిస్తోంది. అందుకే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరుణ్ జోకార్, విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి మన హీరోలు పాన్ ఇండియా మూవీ అయితే చేస్తున్నారు గాని, మరి పాన్ ఇండియా స్టార్స్ గా నిలబడగలరా.. లేదా అనేది రాబోయే సినిమాల చేతుల్లోనే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు