బాలయ్యలో ‘మహానటుడు ఎన్టీఆర్’ను చూడగలమా ?

Published on Jul 19, 2018 3:47 pm IST


క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడుగా నందమూరి బాలకృష్ణ అందరికీ తెలుసు. మరి ఎన్టీఆర్ గా ఎలా ఉంటారో చూద్దామని తెలుగు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నటన, ఆ గాంభీర్యం ఆ మాడ్యులేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మరి అంతటి గొప్ప నటుడిలా నటించి మొప్పించడం అంటే అది అతిశయోక్తే అవుతుంది.

మరి బాలయ్య ఎలా నటిస్తారు ? నిజంగా ఎన్టీఆర్ లా నటించగలరా ? ప్రస్తుతం ఈ ప్రశ్న నందమూరి అభిమానుల్లో కూడా మిలియన్ డాలర్ల క్వశ్చన్ లా అయిపోయింది. అసలు ఏ మాత్రం తేడా వచ్చిన ఎంతో కష్టపడి చేస్తున్న ఈ ప్రయత్నం మొత్తం పూర్తిగా అభాసుపాలు అవుతుంది. కానీ ఆ మధ్య ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్య లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. మనదేశం చిత్రంలోని ఎన్టీఆర్ లుక్ లో కనిపించిన బాలయ్య బాగున్నారు. ముఖ్యంగా ఖాకీ దుస్తులు టోపీతో ఆయన ఎన్టీఆర్ ని గుర్తుకు తెస్తున్నారు.కానీ సినిమా మొత్తం ఇలాగే ఎన్టీఆర్ లా అసాధ్యం అని కొంతమంది పెదవి విరిచారు.

అందుకే సినిమా మొత్తం ఎన్టీఆర్ హావభావాలు, ఆయన మ్యానరిజమ్స్ తోనే బాలయ్య కనిపించేలా క్రిష్ అన్ని జాగ్రత్తలు దగ్గర ఉండి తీసుకుంటున్నాడట. వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :