మహేష్ లేకుండా ‘భరత్ అనే నేను’ లేదు – కొరటాల శివ
Published on Apr 23, 2018 8:32 am IST

దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో వరుసగా నాలుగో విజయాన్ని మహేష్ బాబుతో రెండు విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంతో ఆయన స్థాయి మరింతగా పెరిగిపోయింది. అయన పొలిటికల్ డ్రామాను కమర్షియల్ అంశాలతో జతచేసి చేపిన విధానం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రకు మహేష్ బాబునే ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా ‘ఎవరైతే గొంతు పెంచకుండా సాధారణంగా చెప్పినా జనాలు వింటారో, ఎవరైతే గట్టిగా మాట్లాడకుండా ఎదుటివాళ్ళు చెప్పేది వింటారో, ఎవరైతే అనవసరమైన కోపం తెచ్చుకోకుండా ఉంటారో అలాంటి రాజకీయనాయకుడి పాత్ర ఇది. దీనికి మహేష్ బాబు అయితేనే సరిపోతాడు’ అన్నారు.

అలాగే ఈ పాత్రలో మహేష్ ని తప్ప మరొకర్ని అనుకోలేదని, మహేష్ కథలోని ముఖ్యమంత్రిలాగానే ఉంటారని, ఆయన లేకపోతే ఈ సినిమా లేదని అన్నారు.

 
Like us on Facebook