ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి భారీ మల్టీస్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ చిత్రం “వార్ 2” అనే చెప్పాలి. మరి రీసెంట్ గానే ఓ సాలిడ్ షెడ్యూల్ ముంబైలో కంప్లీట్ కాగా ఎన్టీఆర్ హైదరాబాద్ కూడా వచ్చేశాడు.
మరి ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ టాక్ ఇప్పుడు వైరల్ గా వినిపిస్తోంది. గత సినిమానే యాక్షన్ పరంగా ఏ లెవెల్లో ఉందో చూసాము. ఇక ఈ సినిమాకి అయితే ఏకంగా హాలీవుడ్ లో పలు భారీ సినిమాలకి వర్క్ చేసిన స్టంట్ డైరెక్టర్ స్పైరో రజటోస్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
హాలీవుడ్ లో “కెప్టెన్ అమెరికా సివిల్ వార్”, “వెనమ్” ఇంకా ఎన్నో ప్రముఖ హాలీవుడ్ సినిమాలు చేసిన టెక్నీషియన్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో వార్ 2 పై ఇప్పుడు అంచనాలు మరింత స్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఈ భారీ చిత్రం ప్లానింగ్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భారీ రిలీజ్ కి పాన్ ఇండియా లెవెల్లో రానుంది.