Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : కెప్టెన్ రాణా ప్రతాప్‌ – బాగా నిరుత్సాహ పరుస్తాడు !

Captain Rana Prathap movie review

విడుదల తేదీ : జూన్ 28, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : హ‌రినాథ్ పొలిచెర్ల‌,సుమ‌న్‌,పునీత్ ఇస్సార్‌,షాయాజీ షిండే ,అమిత్‌, జ్యోతిరెడ్డి, నిషి ,గిరి త‌దిత‌రులు
దర్శకత్వం : హ‌రినాథ్ పొలిచెర్ల‌
నిర్మాత : హ‌రినాథ్ పొలిచెర్ల‌
సంగీతం : చ‌ర‌ణ్‌-ష‌కీల్‌
సినిమాటోగ్రఫర్ : వ‌ంశీ ప్ర‌కాశ్‌
ఎడిటర్ :  వెంక‌ట ర‌మ‌ణ‌

 

కథ :

 

‘కెప్టెన్‌ రాణా ప్రతాప్‌’ ( హరినాథ్‌ పొలిచెర్ల ) ఒక సిన్సియర్ మిలటరీ ఆఫీసర్‌. పాక్ మరియు చైనా ఏర్పాటు చేసిన రహస్య ఆపరేషన్ ను ఛేదించడానికి పాకిస్థాన్‌ కి వెళ్తాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రాణా ప్రతాప్‌ పాక్ సైన్యానికి పట్టుబడతాడు. ఈ క్రమంలో భారతదేశంలోని హైదరాబాద్ నగరాన్ని నాశనం చేయడానికి పాక్ యోచిస్తోందని తెలిసి.. పాక్ సైన్యం
తప్పించుకుంటాడు. ఆ తరువత హైదరాబాద్ ను ఘోరమైన బాంబు దాడి నుండి ఎలా కాపాడాడు ? అనేదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

సినిమాలో ప్రధానంగా చర్చించిన ‘సైనికుల జీవితాలకు సంబధించిన అంశం.. అలాగే ‘సైనికుల తమ కుటుంబాల్ని త్యాగం చేస్తూ దేశాన్ని ఎలా కాపాడుతున్నారనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించడం బాగుంది. ఇక హరినాథ్‌ పొలిచెర్ల తన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబబర్చే ప్రయత్నం చేశారు. రానా ప్రతాప్ భార్యగా నటించిన సీరియల్ నటి ఆమెకి ఇచ్చిన ఎమోషనల్ రోల్ లో చాల బాగా నటించింది. అలాగే రానా ప్రతాప్ కుటుంబం మధ్య కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగున్నాయి.

ఇక సుమన్ కూడా తన పాత్రలో ఎప్పటిలాగే చాల బాగా నటిస్తూ ఉన్నంతసేపు ఆకట్టుకుంటానికి ప్రయత్నించారు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన నిషిగంధ తన అందంతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు. అలాగే ఆర్మీలో జరిగే కొన్ని సంఘటనలను విశ్లేషాత్మకంగా చూపించే ప్రయత్నం చేయడం బాగుంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

నటుడిగా ఈ సినిమాలో తన నటనతో పర్వాలేదనిపించన హరినాథ్‌ పొలిచెర్ల దర్శకుడిగా మాత్రం ఆకట్టుకుకోలేకపోయారు. నటన మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ ఆయన కథాకథనాల పై పెట్టలేదు. సినిమాలో చాల వరకూ ప్లో మిస్ అవ్వడం వల్ల ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారు. పైగా కథనం చివరికి వెళ్లేసరికి పూర్తిగా తేలిపోయింది.

అనేక సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సన్నివేశాలను చూడలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మెయిన్ గా హీరో కోసం అనవసరమైన బిల్డప్ షాట్స్ మరియు టాప్ ఎలివేషన్స్ షాట్స్ విసిగిస్తాయి. పైగా హరనాథ్ పాకిస్తాన్ నుండి తప్పించుకొని భారత సరిహద్దుకు చేరుకునే ప్రీ-క్లైమాక్స్ దృశ్యాలు అయితే వాస్తవానికి పూర్తి దూరంగా సాగుతాయి.

పాకిస్తాన్ జైలులో హీరో – సీనియర్ నటుడు సయాజీ షిండే కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకులకు చికాకు కలిగిస్తాయి. ఓవరాల్ గా టైట్ స్క్రీన్ ప్లే తో మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ తో సినిమాను ఆసక్తికరంగా మలచడంలో హరినాథ్‌ పొలిచెర్ల పూర్తిగా విఫలం అయ్యారు.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సినిమాలో దర్శకత్వం లోపం కొట్టొచినట్లుగా కనపడుతుంది. ప్రధానంగా అన్ని కీలక సన్నివేశాలు తేలిపోయాయి. పైగా నిర్మాణ విలువలు కూడా చాలా పూర్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్రధానమైన లోపంగా నిలుస్తోంది. ఇక గ్రాఫిక్స్ పరిస్ధితి పూర్తిగా దయనీయం. అయితే ఈ చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అలాగే రెండు ఎమోషనల్ సాంగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

 

తీర్పు :

 

డా. హరినాథ్‌ పొలిచెర్ల పవర్‌ ఫుల్‌ ఆర్మీ ఆఫీసర్‌ గా వచ్చిన ఈ ‘కెప్టెన్‌ రాణాప్రతాప్‌’ ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. కథ కథనాల్లో ప్లో మిస్ అవ్వడం, పైగా సినిమా బాగా స్లోగా సాగడం.. అలాగే కొన్ని కీలక సన్నివేశాలన్నీ సహజత్వానికి దూరంగా సాగడం, ప్రతి విభాగంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు ప్రేక్షకుడికి సినిమా పై ఆసక్తిని పూర్తిగా చంపేస్తాయి. చివిరిగా ఈ ‘కెప్టెన్‌ రాణాప్రతాప్‌’ సగటు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోడు.

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :