మాజీ హీరోయిన్ పై లైంగిక హింస కేసు !

మాజీ హీరోయిన్ పై లైంగిక హింస కేసు !

Published on Jan 24, 2019 7:19 PM IST

తెలుగు మాజీ హీరోయిన్ భానుప్రియ పై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. విషయంలోకి వెళ్తే.. సామర్లకోటకు చెందిన ప్రభావతి కుమార్తె సంధ్య చెన్నైలో నివసిస్తోన్న భానుప్రియ ఇంట్లో పని చేస్తోంది. కాగా ప్రభావతి తన కుమార్తెను భానుప్రియ సోదరుడు లైంగికంగా హింసిస్తున్నారని ప్రభావతి ఆరోపణలు చేస్తోంది.

కాగా భానుప్రియ పై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది. అయితే ప్రభావతి చెప్తున్న దాని ప్రకారం సంధ్య తనకు ఫోన్ చేసి భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ లైంగికంగా వేధిస్తున్నాడని తన కుమార్తె తనకు చెప్పినట్లు ప్రభావతి చెప్పుకొస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు