కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశం నలుమూలలలా నిరసనజ్వాలలు చెలరేగుతున్నాయి. చెన్నైలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, చెన్నైలోని వళ్లువార్ కొట్టంలో భారీస్థాయిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ నిరసనలో హీరో సిద్ధార్థ్ కూడా పాల్గొన్నాడు. అయితే ఈ ఆందోళనలో పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు 143 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో హీరో సిద్ధార్థ్ పైనా కేసు నమోదైంది. అనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు ఆరోపించారు.
ఇక ఇటీవల సిద్దార్ధ్ వదలదు అనే ఓ హారర్ అండ్ యాక్షన్ మూవీ చేశారు. కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సిద్దార్ధ్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గా నటించారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో నటిస్తున్నారు.


