నోట్ల రద్దు గీతంతో వచ్చిన ‘క్యాష్ క్యాష్’ !

నోట్ల రద్దు గీతంతో వచ్చిన ‘క్యాష్ క్యాష్’ !

Published on Apr 10, 2019 1:00 PM IST

తమిళంలో ‘థట్రోమ్ థూక్రోమ్’ పేరుతో రూపొందుతున్న చిత్రమ్ ‘క్యాష్ క్యాష్’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. మీడియా మార్షల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అరుళ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మొదటి సింగిల్ ‘డిమోనిటైజెషన్ సాంగ్’ ను దర్శకుడు బాబీ ఈ రోజు విడుదల చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు అరుళ్ కుమార్ మాట్లాడుతూ “ఈ పాట తమిళంలో ఒక ఉద్రేకంతో జనంలోకి వెళ్ళింది. అలాగే తెలుగు ప్రేక్షకులను ఈ పాట అలాగే ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను లాంచ్ చేసినందుకు స్టార్ డైరెక్టర్ బాబీగారికి నా ధన్యవాదాలు” అని అన్నారు. అనంతరం దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఈ పాట వినగానే నోట్ల రద్దు సమయంలో ఎదుర్కొన్న కొన్ని వాస్తవిక పరిస్థితులను గుర్తుకు తెచ్చింది. అలాగే ప్రజలు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించిన పద్ధతి నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు డిజే వసంత్ మాట్లాడుతూ.. ‘నేను సంగీత దర్శకుడిని అయినా.. తెలుగులో మొట్టమొదటి సారిగా ఈ సినిమా కోసం ఈ పాట రాశాను. ఈ చిత్రబృందం ఓ గీత రచయిత ఉంటే చెప్పండి అని నన్ను అడిగారు. నోట్ల రద్దు టైంలోని పరిస్థితుల గురించి పాట రాయాలి అన్నప్పుడు.. అప్పటి పరిస్థితులు ఎదుర్కున్న వాడిగా నేనెందుకు ఈ పాట రాయకూడదు అనిపించింది. అలా ఈ పాటను రాసాను. బాగా వచ్చింది. మీరందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను’ అని చెప్పారు.

కాగా ఈ సాంగ్ ను తమిళ్ హీరో శింబు పాడారు. మ్యూజిక్ సెన్స్ ఉన్న శింబు ఈ పాట పాడటం వల్ల పాట చాలా బాగా వచ్చింది. ముందుగా ఈ సినిమా నుండి ప్రతిష్టాత్మక గీతంతో ప్రమోషన్స్ ను మొదలు పెట్టడం ఆనందంగా ఉందని చిత్రబృందం చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు