దేవరకొండ కు జోడిగా క్యాథరిన్ !

Published on Feb 3, 2019 11:13 am IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం ప్రస్తుతం కొత్తగూడెం లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో విజయ్ సింగరేణి కార్మికుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం వాటికీ సంబందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా క్యాథరిన్ ట్రెసా నటిస్తుంది. ఆమెతో పాటు గా ఈచిత్రంలో రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , ఇజబెల్లి కథానాయికలుగా నటిస్తున్నారు.

కె ఎస్ రామ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక విజయ్ ఈచిత్రం తోపాటు భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది సమ్మర్ లో విడుదలకానున్నాయి.

సంబంధిత సమాచారం :