నాగ్ కి ప్రముఖుల నుంచి ప్రత్యేక బర్త్‌ డే విషెస్ !

Published on Aug 29, 2021 7:03 pm IST

కింగ్ నాగార్జున ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. తెల్లవారుజామునే అభిమానులు కొందరు నాగార్జున ఇంటికి చేరుకొని మరి తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులతో పాటు సినీ స్టార్స్ కూడా నాగార్జునకు సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరి, నాగార్జున కు బర్త్‌ డే విషెస్ ను సినీ ప్రముఖుల్లో ఎవరు ఎలా చెప్పారో చూద్దాం.

‘నా మనకు దగ్గరమైన ప్రియమైన వ్యక్తి నాగార్జున. నాగ్ నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించగలవు. ఎన్నో ప్రయోగాలు చేసి.. నటుడిగా నీ పరిధిని విస్తృతం చేసుకునే నువ్వు, ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి

‘గొప్ప అద్భుతమైన మా నాగ్‌ మామకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పై నాకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను, మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంతో ఫుల్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను” – అక్కినేని సమంత

‘బంగారం లాంటి మనసు కలిగిన అద్భుతమైన నటుడు మన టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో అద్భుతమైన పాత్రల్లో సినిమాల్లో నటించి మమ్మల్ని అలరించాలి’ – బాబీ

‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున బాబు. నేను ఈ రోజు ఒక డైరెక్టర్‌ గానిలబడ్డాను అంటే కారణం మీరే. ‘మాస్‌’తో మీరు ఇచ్చిన ఛాన్స్ ను నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆ రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తున్నాను’ – రాఘవ లారెన్స్

‘అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నవ మన్మథుడు అంటే నాగార్జుననే. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సర్‌’ – రాహుల్‌ రవీంద్ర

‘ఎవర్‌ గ్రీన్‌ ట్రెండ్‌ సెట్టర్‌ కింగ్‌ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి వ్యక్తి, మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలి’ – మంచు లక్ష్మి

సంబంధిత సమాచారం :