అమలాపాల్ సినిమాలో నేక్‌డ్ షాట్స్ తొలగింపు

Published on Jun 21, 2019 12:00 am IST

అమలాపాల్ నటించిన కొత్త చిత్రం ‘ఆడై’. ఇటీవలే టీజర్ విడుదలైంది. అందులో అమలాపాల్ నేక్‌డ్ షాట్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టీజర్ చూసిన అందరూ అమలాపాల్ సాహసానికి మెచ్చుకున్నారు. ఇంత బోల్డ్ సినిమాను ఎంచుకున్నందుకు, కొన్ని షాట్స్‌లో నగ్నంగా నటించినందుకు ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. సినిమాకి కూడా హైప్ బాగా పెరిగింది. అయితే టీజర్‌లో ఉండేది తక్కువని, సినిమాలో ఇంకా ఇలాంటి షాట్స్ చాలానే ఉంటాయని చిత్ర వర్గాలు చెప్పాయి.

కానీ సెన్సార్ బోర్డు మాత్రం సినిమాకు షాకిచ్చింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమాలో ఉన్న పలు నేక్‌డ్ షాట్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట. అసభ్యంగా ఉన్నాయనే కారణంగా వాటిని తొలగించడమో, డీఫోకస్ చేయడమో, వేరే వాటితో రీప్లేస్ చేయడమో చేయాలని ఆదేశాలిచ్చి చివరికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారట. అంటే టీజర్‌ ఉన్నంత బోల్డ్ కంటెంట్ కత్తిరింపులు పడిన సినిమాలో అంతగా ఉండకపోవచ్చన్నమాట.

సంబంధిత సమాచారం :

More