సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “సర్కారు వారి పాట”.?

Published on May 6, 2022 4:11 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. మహేష్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా హైప్ ఓ రేంజ్ లో పెరుగుతూ వస్తుంది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు సెన్సార్ పనులు పూర్తి అయ్యినట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రానికి గాను సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ సినిమా పై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ మే 12న ఈ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :