
విభిన్న కథలతో, పాత్రలతో ప్రయోగాలు చెయ్యటంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఎప్పుడు ముందుంటారు. తనదైన శైలీలో అతను తన అభిమానులను సంపాదించుకున్నారు. విమర్శకుల నుంచి సైతం అతను ప్రశంశలను పొందారు. కానీ విజయాలను మాత్రం ఆయన దక్కించు కోలేక పోయారు. చాలా కాలం తరువాత నిర్మిసున్న ఓ చిత్రం ఇతను తీవ్రంగా కష్టపడుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తన తదుపరి చిత్రాన్ని నిర్మించాలని చంద్రశేఖర్ నిర్ణయించుకున్నారు. తన అన్ని చిత్రాల కంటే ఈ చిత్రం కమర్షియల్ గా ఉంటుందని ఆయన తెలిపారు. అంతా సక్రమంగా జరిగితే వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పుడిప్పుడే తన అభిమానులను పెంచుకొంటున్న ఓ యంగ్ హీరో ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు.