
గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే రొమాంటిక్ – యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ని ఫినిష్ చేసిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘మజ్ను’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా వైజాగ్ లో జరుగుతోంది. రెండు రోజుల క్రితమే నాగ చైతన్య – శృతి హాసన్ లపై ఓ సాంగ్ ని షూట్ చేయనున్నారని తెలిపాము.
చెప్పిన దాని ప్రకారమే ఈ సాంగ్ షూట్ ని వైజాగ్ లోని సెయింట్ అలోయ్సుస్ స్కూల్ లో షూట్ చేస్తున్నారు. నైట్ టైంలో షూట్ చేయాల్సిన సాంగ్ కావడం వలన నిన్న నైట్ షూట్ మొదలు పెట్టారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సాంగ్ కావడం వలన ఈ సాంగ్ ని నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేస్తున్నారు. ఈ నెల 17వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ తో సాంగ్ షూట్ ఫినిష్ చేయనున్నారు.
ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో శృతి హాసన్ తో పాటు, అనుపమ పరమేశ్వరన్ ని కూడా మరో హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. మూడవ భామగా రెజీన అయితే బాగుంటుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

