ఈ సారైనా హిట్ వస్తోందా ?

ఈ సారైనా హిట్ వస్తోందా ?

Published on Mar 6, 2019 12:00 AM IST

Chaitanya nara rohit

బాణం లాంటి వినూత్నమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన చెైతన్య దంతులూరి దర్శకత్వంలో తాజాగా వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు ‘నారా రోహిత్’ 1971 కాలంలో సాగే ఓ పీరియాడిక్ డ్రామాగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

ఇక దర్శకుడిగా చెైతన్య దంతులూరి తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే చెైతన్య మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు. అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సారీ అన్న హిట్ వస్తోందో లేదో చూడాలి.

తాజా వార్తలు