VIROSH : హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక వెడ్డింగ్.. పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?

VIROSH : హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక వెడ్డింగ్.. పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?

Published on Mar 5, 2026 7:00 PM IST

Vijay-Rashmiaka

స్టార్ జోడీ విజయ్ దేవరకొండ – రష్మికల వివాహం టాలీవుడ్‌లో ది మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ వెడ్డింగ్‌గా నిలిచింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో రాజరికపు హంగులతో మొదలైన ఈ వేడుకలు, వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలతో అత్యంత వైభవంగా సాగాయి. షాపింగ్, నగలు, గ్రాండ్ రిసెప్షన్ ఇలా అన్నింటికీ కలిపి ఈ పెళ్లికి సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సినీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.

ఈ వివాహ వేడుకల్లో ఆభరణాల హంగామా కూడా భారీగానే ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జంట మొత్తం మూడు కిలోల బంగారు నగలను ధరించారు. అందులో రష్మిక రెండు కిలోలు, విజయ్ ఒక కిలో బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు. గతంలో నాగచైతన్య – సమంత పెళ్లికి అయిన రూ.10 కోట్ల ఖర్చుతో పోలిస్తే, విజయ్ – రష్మిక వెడ్డింగ్ ఆ రికార్డును తిరగరాసిందని టాక్.

ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ పర్యవేక్షణలో జరిగిన ఈ వివాహ వేడుకలు అటు ఉదయ్‌పూర్ ప్యాలెస్ నుండి ఇటు హైదరాబాద్ రిసెప్షన్ వరకు ఒక సెలబ్రేషన్‌లా సాగాయి. ఈ భారీ ఖర్చును విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి భరించినట్లు తెలుస్తోంది. కేవలం తమ పెళ్లితోనే కాకుండా పెళ్లి ఖర్చుతో కూడా విజయ్-రష్మిక ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.

తాజా వార్తలు