సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మజిలీ. కాగా ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితంలోకి.. భర్తే ప్రాణం అని నమ్మే ఒక అమ్మాయి భార్యగా వస్తే.. ఆ తరువాత అతని లైఫ్ ఎలా మారుతుంది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తోన్నట్లు తెలుస్తోంది.
చైతు ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. యంగ్ గెటప్ లో ఒకలా.. సమంతతో పెళ్లి తరువాత గెడ్డంతో మరో గెటప్ లో కనిపించనున్నాడు. అయితే గెడ్డంతో గెటప్ కు సంబంధిచిన పాత్రలో చైతు చాలా బాగా నటిస్తున్నాడట. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.


