ప్రపంచ వ్యాప్తంగా ‘మజిలీ’ 17 డేస్ కలెక్షన్స్ !

Published on Apr 22, 2019 1:48 pm IST

నాగ చైతన్య – సమంత కలయికలో ఏప్రిల్ 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎఫ్ 2 తరువాత అంత స్థాయిలో హిట్ అయిన రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా మజిలీ నిలిచింది. మొత్తానికి మజిలీకి జెర్సీ, కాంచన 3 చిత్రాల రూపంలో బాగానే పోటీ ఉన్నా.. ఇంకా కొన్ని ‘ఏ’ సెంటర్స్ లో మజిలీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబడుతుంది. ఇక ఈ చిత్రం మొత్తం పదిహేడు రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా 60.05 కోట్ల గ్రాస్ ను అలాగే 35.57 కోట్ల షేర్ ను రాబట్టింది.

పైగా మూడవ వారంలోకి ఎంటర్ అయిన కూడా ఈ చిత్రం ఇప్పటికి మంచి కలెక్షన్లను రాబడుతూ అన్ని ఏరియాల్లో లాభాలను తెస్తోంది. చైతు కెరీర్ లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా మజిలీ 17 రోజుల కలెక్షన్ల వివరాలు :

నైజాం – 12.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.07 కోట్లు
సీడెడ్ – 4.08 కోట్లు
గుంటూరు – 2.01 కోట్లు
తూర్పు గోదావరి – 1.65 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.27 కోట్లు
కృష్ణా – 1.75 కోట్లు
నెల్లూరు – 0.84 కోట్లు

కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా- 4.02 కోట్లు

యూఎస్ఏ – 3.85 కోట్లు

మొత్తం 17రోజులకు గాను మజిలీ గ్రాస్ 60.05 కోట్లు కాగా, 35.57 కోట్ల షేర్ ను రాబట్టింది.

సంబంధిత సమాచారం :