‘ఛలో’ దర్శకుడి నెక్స్ట్ సినిమా వివరాలు !

‘ఛలో’ సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు వెంకి కుడుముల తరువాత సినిమాను హారికా అండ్ హాసిని బ్యానర్లో చెయ్యబోతున్నాడు. కథా చర్చలు పూర్తైన ఈ సినిమాలో సరైన హీరో కోసం చూస్తున్నారు. త్వరలో ఇద్దరు ముగ్గురు హీరోలకు కథ వినిపించి ఎవరో ఒకరితో సినిమా అనౌన్స్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

హారికా అండ్ హాసిని బ్యానర్లో ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా తరువాత వెంకీ కుడుముల సినిమా ఉండబోతుందని సమాచారం. ఇటీవల విడుదలైన ‘ఛలో’ కామెడి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.