‘చాణక్య’ కోసం డబ్బింగ్ చెబుతున్న ‘గోపీచంద్’ !

Published on Aug 18, 2019 3:13 pm IST

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ చాణక్య. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇటివలే ప్రారంభమైన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్‌ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. మరి గోపీచంద్ కి ఈ సినిమానైనా భారీ హిట్ ఇస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :