ఇటలీ వెళ్లిన “చాణక్య”, ఏమి చేస్తున్నాడంటే…?

Published on Aug 30, 2019 6:00 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్ దర్శకుడు తిరు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “చాణక్య”. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ ఇటలీ లోని మిలాన్ వెళ్లినట్టు తెలుస్తుంది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం పర్యవేక్షణలో మిలాన్‌ వేదికగా పాట‌ల‌ చిత్రీకరణ జరుగుతుంది.

టెర్రరిజం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మరో మారు మెహ్రిన్ నటిస్తుంది. గతంలో వీరిద్దరూ పంతం చిత్రం కొరకు కలిసి పనిచేశారు. చాణక్య చిత్రంలో జరీన్ ఖాన్ మరో తారగా నటిస్తుండగా, విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :