‘పుష్ప’లో తరుణ్ కూడ భాగమవుతాడా ?

Published on Jun 1, 2021 7:07 pm IST

‘పుష్ప’లో తరుణ్ భాగమవ్వడం ఏమిటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. అయితే ఆ అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు కొందరు. భాగమవ్వడం అంటే నటించడం కాదు డబ్బింగ్ చెప్పడం. అవును తరుణ్ ‘పుష్ప’లో విలన్ పాత్ర చేస్తున్న ఫహాద్ ఫాజిల్ పాత్రకు డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఉందట. ఇటీవల ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ‘అనుకోని అతిథి’ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రను పోషించడం జరిగింది.

ఫహాద్ ఫాజిల్ కు తెలుగు అస్సలు పరిచయం లేని భాష. అందుకే ఆ సినిమాలో ఆయన పాత్రకు తరుణ్ తెలుగు డబ్బింగ్ చెప్పడం జరిగింది. సినిమా చూసిన వాళ్ళు తరుణ్ వాయిస్ ఫహాద్ ఫాజిల్ కు బాగానే సెట్టయ్యిందని అంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ తో సుకుమార్ అండ్ టీమ్ ‘పుష్ప’లో ఫహాద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ ద్వారానే డబ్బింగ్ చెప్పించాలని అనుకోవచ్చు. అదే జరిగితే తరుణ్ పాన్ ఇండియా మూవీలో భాగం కావొచ్చు. మరి సుకుమార్ తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పిస్తారు లేకపోతే వేరే ఎవరినైనా తీసుకుంటారా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :