చాలా రోజుల నుంచి ప్రేక్షకుల ముందుకు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి భారీగా ప్రచారం చేసిన ‘చందమామ కథలు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు రిలీజ్ చేసిన ట్రైలర్స్, టీజర్స్ అందరిలోనూ ఆసక్తిని పెంచాయి.
గతంలో ఈ చిత్ర ట్రైలర్ చూసి ఎస్ఎస్ రాజమౌళి కూడా చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా విజయం
సాదించాలని కోరుకున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో 8 విభిన్న కథలను చూపించనున్నారు. లక్ష్మీ మంచు, సీనియర్ నరేష్, ఆమని, కృష్ణుడు, కిషోర్, అభిజీత్, చైతన్య కృష్ణ, నాగ సౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.


