ఇంటర్వ్యూ : చాందిని చౌధరి – ‘మను’ ప్రాణం పెట్టి చేశాను !

Published on Sep 4, 2018 3:25 pm IST

రాజా గౌతమ్ ,చాందిని చౌధరి హీరో హీరోయిన్లుగా దర్శకుడు ఫణింద్ర నారిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘మను’. ఈనెల 7న విడుదలవుతున్న సందర్బంగా చాందిని చౌధరి మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం ..

ఈ చిత్రం దేని గురించి ఉండనుంది ?
ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ . స్టోరీ నేను రివీల్ చేయాలేను ఎందుకంటె మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. ఒక్కటి మాత్రం చెప్పగలను మీరు థియేటర్లో సినిమా చూసేటప్పుడు గొప్ప అనుభూతికి లోనవుతారు.

మీ పాత్ర గురించి ?

సినిమాలో నేను నిలా అనే పాత్రలో నటించాను. సినిమాకు చాలా ముఖ్యమైన పాత్ర. నా పాత్రకూడా చాలా సహజం గా ఉంటుంది. ఈసినిమాలో ఎమోషనల్ సీన్లకు గ్లిజరిన్ కూడా ఉపయోగించలేదు. నా ప్రాణం పెట్టి చేశాను అంతలా ప్రేమించి చేశాను.

సినిమా షూటింగ్ ఎక్కడ జరిగింది ?

సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరిగింది. 70శాతం షూటింగ్ అంత ఇండోర్ షూటింగే . సినిమా కోసం ఓకే ప్రత్యేకమైన సెట్ ను రూపొందించారు. మొత్తం ఆ సెట్లోనే తెరకెక్కించారు.

దర్శకుడు గురించి ?
ఫణింద్ర చాలా బాగా తీశాడు . ఇంతకుముందు రెండు చిత్రాలను తెరకెక్కించారు. ఇది మూడవ సినిమా చాలా బాగా తీశాడు. తక్కువ బడ్జెట్ లో చాలా మంచి క్వాలిటీ తో తెరకెక్కించాడు. ఈసినిమా తీయడానికి చాలా సమయం పట్టింది కానీ ఆయనకు నచ్చిన అవుట్ ఫుట్ ను రాబట్టుకోగలిగారు.

మీ చిత్రానికి కేరాఫ్ కంచరపాలం పోటీ గా భావిస్తున్నారు ?

లేదండీ. రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలైవుతున్నాయి. నిజానికి ఆచిత్ర డైరెక్టర్ వెంకటేష్ మహా ఆయన సినిమాకన్నా మా సినిమా ఫై ఎక్కువ ఆసక్తిని చుపిస్తున్నారు. రెండు సినిమాలు బాగా ఆడాలి . ఇటీవల ‘గూఢచారి, చి ల సౌ’ చిత్రాలు కూడా ఒకే రోజు విడుదలైయ్యాయి. రెండు సూపర్ హిట్ ఆయాయ్యి . ఈ రెండు చిత్రాలు కూడా వేరే జోనర్లో వస్తున్నాయి. ఇవి కూడా బాగా ఆడుతాయి అని అనుకుంటున్నాను.

మీ తదుపరి చిత్రాల గురించి ?

ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులను హోల్డ్ లో పెట్టాను. ఈసినిమా తరువాత డిసైడ్ అవుతాను. ప్రస్తుతం నా కాన్సంట్రేషన్ అంత మను పైనే వుంది .

సంబంధిత సమాచారం :