దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, గతంలో తాను చంద్ర సిద్ధార్థ్ వద్ద స్క్రిప్ట్ విభాగంలో పని చేశానని గుర్తు చేసుకున్నారు. ఇంత పెద్ద టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇది విభిన్నమైన చిత్రమవుతుందని చంద్ర సిద్ధార్థ్ పేర్కొన్నారు.
దివంగత రచయిత మదన్ అందించిన కథతో, సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్ తదితర అంశాల నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి పులగం చిన్నారాయణ మాటలు రాయగా, జే రెక్స్ సంగీతం అందించారు.


