ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్.. ఏడ్చేసిన చంద్రబాబు..!

Published on Nov 20, 2021 1:00 am IST


టాలీవుడ్‌ వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏ సినిమా మొదలుపెడతాడో ఎవరికీ తెలీదు. అప్పుడెప్పుడో ఆర్జీవీ మిస్సింగ్‌ అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చిన వర్మ తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే దీని ప్రమోషన్ కోసం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని వాడేసుకున్నాడు వర్మ.

అది ఎలా అంటే నేడు ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత ఛంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో కొందరు వైసీపీ నేతలు తన ఫ్యామిలీని కించపరిచినట్టు మాట్లాడడమే కాకుండా, తన భార్య భువనేశ్వరిని ఈ వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు, మళ్లీ సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలోకి వస్తానని ఛంద్రబాబు శపథం చేశాడు. అనంతరం మీడియా ముందుకొచ్చి కన్నీరు పెట్టుకున్నాడు.

అయితే చంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి, దానికి ముందు ఓ వాయిస్‌ను జోడించాడు. ‘ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు’ అని చంద్ర‌బాబు చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా ఉంది. ఈ వీడియోకు క్యాప్షన్‌గా ఆర్జీవీ ఇప్పుడే చంద్రబాబు ‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్‌ను చూశాడని, ఆయన స్పందనకు చాలా థ్యాంక్స్ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దీనిని చూసిన నెటిజన్లంతా ఇలాంటి ప్రమోషన్ క్రియేటివిటీ ఆర్జీవి ఒక్కడికే సాధ్యమని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :