పొంగల్ రిలీజ్‌కు ఫిక్స్ అయిన సిద్ధార్థ్-త్రిష సినిమా!

పొంగల్ రిలీజ్‌కు ఫిక్స్ అయిన సిద్ధార్థ్-త్రిష సినిమా!

Published on Nov 5, 2015 5:00 PM IST

Chandrakala-Mobole-telugu
సిద్ధార్థ్‌, త్రిష, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తమిళంలో ‘అరన్‌మనై 2’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. హన్సిక లీడ్ రోల్‌లో నటించిన హర్రర్ కామెడీ ‘అరన్‌మనై’ (తెలుగులో చంద్రకళ)కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హర్రర్ కామెడీకి తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ కనిపిస్తోన్న నేపథ్యంలో అరన్‌మనై 2 తమిళ నాట క్రేజీ ప్రాజెక్టుగానే కనిపిస్తోంది. ‘చంద్రకళ’ సినిమాకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చినందున ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాను ఇక్కడ కూడా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పొంగల్ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవనుందనే విషయాన్ని దర్శకుడు ఇంతకుముందే ప్రకటించగా, కొద్దిరోజులుగా ఈ సినిమా పొంగల్‌కు రిలీజ్ కావట్లేదనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయమై సినిమా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేస్తూ పొంగల్‌కు అరన్‌మనై 2 సినిమా కచ్చితంగా విడుదలై తీరుతుందని తెలియజేసింది. 103 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక క్లైమాక్స్ సాంగ్‌ను షూట్ చేయడం ఈ సినిమా విషయంలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు