‘సింగం 3’ టైటిల్ మారిపోయింది..!
Published on Jan 17, 2017 4:42 pm IST

singam-3
హీరో సూర్యకు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టిన సినిమా ‘సింగం’. ఆ తర్వాత దానికి రెండో భాగం ‘సింగం 2’ విడుదల కాగా అది కూడా బంపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడదే సిరీస్‍లో భాగంగా, సూర్య సూపర్ మాస్ హీరోగా నటించిన ‘సింగం 3’ ఈనెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మొదటి రెండు భాగాల్లానే ఈ సినిమా కూడా పెద్ద హిట్‌గా నిలుస్తుందని సూర్య భారీ ఆశలే పెట్టుకున్నారు. ముఖ్యంగా సూర్య కెరీర్‌లో మొదటి వంద కోట్ల సినిమాగా ‘సింగం 3’యే నిలుస్తుందన్న ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో చిన్న ఇబ్బంది వచ్చి పడింది. తెలుగు, తమిళ రెండు భాషలకు అనువుగా ‘సింగం 3’ (Singam 3)కి ‘ఎస్ 3’ అన్న టైటిల్ ఖరారు చేశారు. ‘ఎస్ 3’ అన్న పేరుతోనే సినిమా ఇప్పటివరకూ ప్రచారం పొందుతూ వస్తోంది. అయితే తమిళనాడు ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపుకు కొన్ని షరతులు ఉన్నాయి. అందులో టైటిల్‌ ఇంగ్లీష్‌లో ఉండకూడదన్నది ఒక షరతు. ‘ఎస్ 3’ టీమ్ ఈ నేపథ్యంలోనే సినిమా టైటిల్‌ను ‘సీ 3’ (Cingam 3)గా మార్చేసింది. తమిళంలో విడుదలయ్యే ప్రతి సినిమా ఈ షరతులను ఫాలో అవుతూ ట్యాక్స్ మినహాయింపును పొందుతూనే వస్తున్నాయి. సినిమాకు సహకారం అందించాలన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ ఆనవాయితీని కొనసాగిస్తోంది.

 
Like us on Facebook