“రాఖీ” లో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ పై చిరు అలా అన్నారు – ప్రొడ్యూసర్ కే.ఎల్. నారాయణ

“రాఖీ” లో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ పై చిరు అలా అన్నారు – ప్రొడ్యూసర్ కే.ఎల్. నారాయణ

Published on May 3, 2024 2:14 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో, డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ రాఖీ. 2006 లో థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ఈ చిత్రం కి నిర్మాతగా వ్యవహరించిన కే.ఎల్. నారాయణ తాజాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం జరిగింది.

ఈ చిత్రం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోర్టు సీన్ లో చాలా భారీ డైలాగ్ ను చెప్పారు. అది ప్రివ్యూ చూసిన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇలా ఎవరూ చెప్పలేమన్నారు అని తెలిపారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంకి కే. ఎల్. నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు