ఇక చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ మొదలు అప్పుడే.!

Published on May 16, 2021 9:40 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబోలో అనౌన్సమెంట్ తోనే ఎలాంటి సంచలనం రేగిందో చూసాము. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సెన్సేషనల్ కాంబో ఎలాంటి కథతో వస్తారో ఎప్పుడు నుంచి మొదలు పెడతారు అన్న వాటి కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అన్నీ సక్రమంగా జరిగితే జరిగితే ఈ ఏడాదిలోనే ఈ చిత్రం మొదలు అవుతుందని తెలిసింది.

కానీ దీనికి ముందు విశ్వనటుడు కమల్ హాసన్ తో చెయ్యాల్సిన “ఇండియన్ 2” చిత్రం స్టార్ట్ కానుందట.ప్రస్తుతం ఆ సినిమా బ్యాలన్స్ షూట్ పైనే కమల్ మరియు మేకర్స్ చర్చలు నడుస్తున్నాయి. దీనితో అదే కనుక జరిగితే ఇక చరణ్ తో ప్రాజెక్ట్ వచ్చే ఏడాదిలోనే మొదలు కానున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. మొత్తానికి మాత్రం ఈ భారీ సినిమా కోసం మాత్రం చరణ్ ఫ్యాన్స్ గట్టిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :