చరణ్ ‘బ్రూస్ లీ’ ఆడియోకి ఇన్నర్ టాక్ అదుర్స్.!

చరణ్ ‘బ్రూస్ లీ’ ఆడియోకి ఇన్నర్ టాక్ అదుర్స్.!

Published on Sep 30, 2015 11:48 PM IST

Bruce-Lee1
యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. దీనికి ట్యాగ్ లైన్ ‘ది ఫైటర్’. టైటిల్ అండ్ ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగానే సినిమాలో కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. గత మూడు రోజులుగా మెగాస్టార్ చిరంజీవిపై వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక మరో 6 రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన బ్రూస్ లీ ఆడియో అక్టోబర్ 2న హైదరాబాద్ లోని హైటెక్స్ లో లాంచ్ కానుంది.

ఇంతకీ సాంగ్స్ ఎల్ ఉన్నాయా అని ఇప్పటికే ఎ ఆల్బమ్ విన్న మెగా ఫ్యామిలీ మరియు తమన్ సన్నిహితులను అడిగితే.. ఆల్బమ్ చాలా బాగా వచ్చిందని. అన్ని పాటలు పెద్ద హిట్ అవుతాయని. రామ్ చరణ్ కెరీర్లో టాప్ 3 బెస్ట్ ఆల్బమ్స్ లో ఇది చేరుతుందని అంటున్నారు. ఆడియో సక్సెస్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే అంటారు. ఆ లెక్కన ఇన్నర్ రిపోర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం సాంగ్స్ హిట్ అయితే రిలీజ్ కి ముందు మంచి ఊపోస్తుంది. సాంగ్స్ వినాలి అంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. మరోవైపు రిలీజ్ కి ఇంకా 20 రోజులు మాత్రమే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు