“ఆచార్య”లో చరణ్ ఎపిసోడ్స్ మాములుగా ఉండవట.!

Published on Aug 11, 2020 9:00 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ చిత్రంలో మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇంతకు మునుపు ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఒకేసారి సిల్వర్ స్క్రీన్ ఫ్రేమ్ లో కనిపించినా సింపుల్ గా ప్లాన్ చేసినవే ఉన్నాయి.

కానీ ఈసారి మాత్రం నెవర్ బిఫోర్ లా కొరటాల ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ చిత్రంలోని చరణ్ ఎపిసోడ్స్ చాలా బాగుండనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో చరణ్ ఒక 25 నిమిషాల వ్యవధి వరకు కనిపిస్తారని ఎప్పటి నుంచి వినిపిస్తున్న టాక్. ఈ కనిపించిన పాతిక నిముషాలు అయినా సరే మాములుగా ఉండవట. పవర్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో చరణ్ పరిచయం అయ్యి, గూస్ బంప్స్ ఇస్తారట.

అలాగే చిరు మరియు చరణ్ ల మధ్య ఒక అదిరిపోయే సాంగ్ సహా ఓ బ్లాస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా కొరటాల ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల షూటింగ్స్ జరిగేందుకు అనుకూలమైన వాతావరణం లేదు. ఒకసారి పరిస్థితులు చక్కబడ్డాక చరణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారు.

సంబంధిత సమాచారం :

More