రొటీన్ కు భిన్నంగా, డిఫరెంట్ అప్రోచ్ తో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. 1980ల కాలానికి చెందిన గ్రామీణ నైపథ్యం కలిగిన కథ కావడం, చరణ్ వినికిడి లోపం ఉన్న పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూ క్లాస్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా సినిమాలు చేసే సుకుమార్ ఈ సినిమాలో మాత్రం అభిమానులకు కావల్సిన మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు.
సినిమా మొత్తం లుంగీ కట్టులో కనిపించే చరణ్ పాటల్లో డ్యాన్సులు దుమ్ము దులిపినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే సినిమాలోని ప్రత్యేక గీతం ‘జిగేలురాణి’ ప్రోమో విడుదలైంది. అందులో చరణ్ ఫుల్ ఎనర్జీతో పాటను ఎంజాయ్ చేస్తూ హెవీ స్టెప్పులు వేస్తూ థియేటర్లలో మెగా అభిమానులకు కనులవిందు ఖాయమని హామీ ఇచ్చేశారు. అలాగే చరణ్ స్టెప్పులకు తోడు పూజా హెగ్డే గ్లామర్ కూడ పాటను మరింత అందంగా కనబడేలా చేస్తోంది.
