రేపు జరగనున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు అల్లు అరవింద్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఈ వేడుకను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అశేష మెగా అభిమానుల నడుమ జరగనుంది
ఈ వేడుకలో చిరు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలే కాక ఆయన 150వ సినిమా విశేషాలు కూడా తెలుపనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైనర్ గా సాగనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడి, నాయికామణి వివరాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు
చిరంజీవి కమ్ బ్యాక్ సినిమాను భారీ బడ్జెట్ లో రామ్ చరణ్ నిర్మించనున్న సంగతి తెలిసినదే


