చరణ్ ఇంకా డైలమాలో ఉన్నాడా.?

చరణ్ ఇంకా డైలమాలో ఉన్నాడా.?

Published on Oct 13, 2020 10:02 AM IST

Ram Charan

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే ఈ చిత్రం తో పాటుగా చరణ్ మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో కూడా కనిపించనున్నాడు. అదే చిరు మరియు కొరటాల కాంబోలో వస్తున్న చిత్రం “ఆచార్య”. అయితే ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ చేసే సినిమా ఏంటి అనే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇంకా కొనసాగుతూనే ఉంది.

అయితే చరణ్ రేస్ లో పలువు దర్శకులు స్క్రిప్ట్స్ తో రెడీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. వారిలో లేటెస్ట్ హిట్ దర్శకుడు వెంకీ కుడుముల ఒకరు. అయితే ఈ ప్రాజెక్ట్ ను చరణ్ ఇంకా పెండింగ్ లోనే ఉంచినట్టు తెలుస్తుంది. దీనితో చరణ్ ఇంకా ఏ ప్రాజెక్ట్ కు అంగీకారం ఇవ్వలేదని ఖరారు అయ్యింది. దీనితో చరణ్ ముందు ఏ చిత్రం టేకప్ చెయ్యాలి అన్న డైలమా ఏర్పడింది. మరి చరణ్ ఎవరికి ఓకే చెప్తారో చూడాలి.

తాజా వార్తలు