చరణ్ తో సెట్ కాకపోతే సుకుమార్ కి భారీ గ్యాప్?

Published on Aug 4, 2020 8:58 am IST

ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ మూవీ ఏమిటీ అనే దానిపై క్లారిటీ రాలేదు. మిగతా స్టార్ హీరోలందరూ తమ ప్రస్తుత చిత్రాలతో పాటు తదుపరి చిత్రాలు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకులపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ సైతం చరణ్ తో మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప మూవీ చేస్తున్న సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించలేదు.

వచ్చే ఏడాది పుష్ప విడుదల కానుంది. ఆ తరువాత సుకుమార్ తో మూవీ చేయడానికి ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి స్టార్స్ మొత్తం మరో మూడేళ్లకు సరిపడా ప్రాజెక్ట్స్ సిద్ధం చేసుకున్నారు. ఒక్క చరణ్ మాత్రమే ఖాళీగా ఉండే అవకాశం ఉంది. మరి చరణ్ తో డా మూవీ ఓకే కానీ పక్షంలో ఆయనకు మరో సారి భారీ గ్యాప్ రావడం ఖాయం. అందుకే ఎలాగైనా చరణ్ తో మూవీ ఒకే చేయాలనీ సుకుమార్ ప్రయత్నిస్తున్నారట.

సంబంధిత సమాచారం :

More