చరణ్ రాకతో ఎన్టీఆర్ కి విరామం

Published on Oct 10, 2019 1:00 am IST

కొద్దిరోజులుగా చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు, సైరా విడుదల నేపథ్యంలో చరణ్ ప్రొమోషన్స్ లో బిజీ బిజీగా గడిపారు. దీనితో రాజమౌళి ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారట. ఇప్పుడు సైరా విడుదల కావడంతో పాటు ఘనవిజయం అందుకొంది. ఇక చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నాడట. చరణ్ కాంబినేషన్ లో రానున్న కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ నందు అలియా భట్ కూడా పాల్గొనే అవకాశం కలదు. చరణ్ రాకతో ఎన్టీఆర్ కి రాజమౌళి విరామం ఇచ్చారట.

ఎన్టీఆర్, చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు లు గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగణ్ మరియు సముద్ర ఖని కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కి ఇంకా హీరోయిన్ వెతికే పనిలో జక్కన్న ఉన్నాడు. డివివి దానయ్య నిర్మాతగా 300కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More