రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్

Published on Mar 26, 2014 4:37 pm IST

Ram-Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేసారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కి సోషల్ నెట్వర్కింగ్ లోని వారి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

గత మూడు సినిమాల నుండి ఒకే విధంగా కనిపిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా కోసం సరికొత్త లుక్ ని ట్రై చేసారు. రామ్ చరణ్ ఇది వరకూ కనపడని రీతిలో ట్రెడిషనల్ – వెస్ట్రన్ స్టైల్ మిక్స్ చేసిన లుక్ లో చాలా బాగున్నాడు. అలాగే పిలక, కండలు తిరిగిన బాడీతో చరణ్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రామ్ చరణ్ ని ఇలా సరికొత్త లుక్ లో ప్రజంట్ చేసినందుకు అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు.

కృష్ణ వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీ కాంత్, రాజ్ కిరణ్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

సంబంధిత సమాచారం :