
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి శ్రీనువైట్ల డైరెక్టర్. కడుపుబ్బా నవ్విస్తూనే యాక్షన్ అంశాలను జోడించే శ్రీనువైట్ల ఈ సినిమాలో కూడా కావల్సినంత వినోదాన్ని అందించనున్నాడని సమాచారం. రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో ఇది వరకూ ట్రై చెయ్యని ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ ని ట్రై చేస్తున్నాడు. షూటింగ్ విషయాలు పక్కన పెడితే రామ్ చరణ్ త్వరలోనే మెగా అభిమానులకు ఒకేసారి రెండు గిఫ్ట్స్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు.
అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా రామ్ చరణ్ చిరంజీవి 150వ సినిమాని ప్రారంభించనున్నాడు. ఇది చాలా వరకూ తెలిసిన విషయమే..ఇది కాకుండా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజున తన 9వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపు సినిమాకి టైటిల్ ని కూడా ఫైనలిజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికైతే ‘మై నేమ్ ఈజ్ రాజు / బ్రూస్ లీ’ అనే పేర్లని పరిశీలిస్తున్నారు. దీని ప్రకారం మెగా అభిమానులకు ఆగష్టు 22 అనేది చాలా ప్రత్యకం కానుంది. రామ్ చరణ్ తన సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవ్వాలని స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. కృతి కర్భంద, నదియా ముఖ్య పాత్రలు పోస్శితున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

