మంచు హీరో వేడుకలో మెగా హీరో సందడి

మంచు హీరో వేడుకలో మెగా హీరో సందడి

Published on Mar 6, 2020 11:57 AM IST

ramcharn

మంచు హీరో మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అహం బ్రహ్మస్మి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళ్, హిందీ మరియు ఇతర ప్రధాన భాషలలో విడుదల కానుందని సమాచారం. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా మూడు భిన్న ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న మనోజ్ లుక్ ఆసక్తి రేపింది. కాగా ఈ మూవీ నేడు అధికారికంగా ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన విధంగా మెగా హీరో రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

మంచు మనోజ్ పై చరణ్ క్లాప్ కొట్టారు. అలాగే మూవీ సూపర్ సక్సెస్ కావాలని ఆయన యూనిట్ కి విశెష్ చెప్పారు. మంచు హీరో సినిమా వేడుకలో మెగా హీరో చరణ్ కనిపించడం ప్రత్యేకత చాటుకుంది. అహం బ్రహ్మస్మి చిత్రానికి దర్శకత్వం శ్రీకాంత్ రెడ్డి.

తాజా వార్తలు