శంకర్ సినిమా కోసమే చరణ్ ముందస్తు ‘మాల’ !

Published on Oct 17, 2021 5:30 pm IST


మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూట్ ను డిసెంబర్ లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే స్వతహాగా డిసెంబర్ లలో అయ్యప్ప మాల వేసుకునే చరణ్ ఈ సారి మాత్రం ముందే మాల వేసుకున్నాడు. రామ్ చరణ్ ‘అయ్యప్ప స్వామి’కి గొప్ప భక్తుడు అని తెలిసిందే.

ఇక ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా నటించబోతుంది. అన్నట్టు భారీ బడ్జెట్ రాబోతున్న ఈ భారీ సినిమాలో చరణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ భారీ సినిమాలో కూడా రామ్ చరణ్ ను చాల వినూత్నంగా చూపించడానికి హాలీవుడ్ నుంచి మేకప్ మెన్స్ రప్పించనున్నాడు. అన్నట్టు సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :