ఒక్క షెడ్యూల్ కోసం రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్న రామ్ చరణ్ !

ఒక్క షెడ్యూల్ కోసం రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్న రామ్ చరణ్ !

Published on Jun 28, 2018 10:01 AM IST

రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా’. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కీలకమైన యుద్ధ సన్నివేశాలను, అది కూడా నైట్ ఎఫెక్ట్స్ లో రూపొందిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్స్, ఫైటర్స్ ఈ షెడ్యూల్ కోసం పనిచేస్తున్నారు.

సినిమాలోనే అత్యంత ఖరీదైన ఈ షెడ్యూల్ కోసం చరణ్ రూ.40 కోట్లను ఖర్చు చేస్తున్నారు. కాగా సినిమా మొత్తం బడ్జెట్ రూ.200 కోట్ల వరకు ఉండనుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తునం ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు