పవర్ ఫుల్ లుక్ తో “ఆచార్య” సెట్స్ లోకి చరణ్ అడుగు.!

Published on Jan 17, 2021 10:26 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

చాన్నాళ్ల నుంచి చరణ్ ఎంట్రీ ఆచార్య సెట్స్ లో ఎప్పుడు పడుతుందా అని అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎట్టకేలకు కొరటాల శివ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఓ ఫోటోను షేర్ చేసి చరణ్ చేస్తున్న రోల్ పేరును కూడా రివీల్ చేసారు. మా “సిద్ధ” సర్వం సిద్ధం అంటూ ఆచార్య లోకి చరణ్ షూట్ స్టార్ట్ చేసినట్టుగా తెలిపారు.

మరి అలాగే ఫ్రంట్ లుక్ ఏమి చూపించనకుండా జస్ట్ వెనుక వైపు ఒక సైడ్ నుంచి చూపిస్తూ అదరగొట్టారని చెప్పాలి. చెవికి పోగు, మెడలో రుద్రాక్ష దండ ఎదురుగా కనిపిస్తున్న భారీ గుడి సెట్ వైపుగా నడుస్తున్నట్టుగా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీనితో చరణ్ రోల్ పై మరిన్ని అంచనాలు రేకెత్తుతున్నాయి.

ఇక సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రానికి గాను మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More