పవన్ కోసం షూటింగ్ ఆపుకున్న చరణ్.?

Published on Apr 18, 2021 2:01 pm IST

ఈ ఏడాదిలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” తో అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు అనుకున్న కొద్ది లోనే మళ్ళీ పవన్ కు కరోనా పాజిటివ్ రావడం చాలా బాధ పెట్టింది. దీనితో పవన్ ను జాగ్రత్తగా తమ కుటుంబీకులే చూసుకుంటున్నారు.

పవన్ కు సన్నిహతులు అయిన వైద్యులు సహా అపోలో వారు కూడా సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కు బాగోలేదు అన్న సమాచారం విన్నాక చరణ్ ఇప్పుడు నటిస్తున్న ఆచార్య షూట్ ను నిలుపుకున్నట్టు తెలుస్తుంది.

తాను మరియు ఉపాసన లు పవన్ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకుంటున్నారట. అలాగే చరణ్ కూడా పవన్ పూర్తిగా కోలుకున్నాకే మళ్ళీ షూట్ పాల్గొననున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే ప్రతీ ఒక్కరికీ బాబాయ్ – అబ్బాయిల బాండింగ్ కోసం తెలిసిందే. మరి పవన్ త్వరగా కోలుకోవాలని మనమంతా కూడా కోరుకుందాం.

సంబంధిత సమాచారం :