జపాన్ నుండి ‘రామ్ చరణ్’కు అభిమానంతో.. !

Published on Apr 23, 2019 7:23 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు జపాన్ నుండి పుట్టిన రోజు కానుక అందింది. వివరాల్లోకి వెళ్తే.. చరణ్ గత నెల మార్చి 27వ తేదీన తన 34వ పుట్టినరోజును జరుపుకున్నవిషయం తెలిసిందే. అయితే తమ అభిమాన హీరో పుట్టిన రోజు కానుకగా ఆ రోజు మెగా అభిమానులు వేడుకలతో పాటు పలుచోట్ల రక్త దాన శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే జపాన్ అభిమానుల నుండి రామ్ చరబ్ తేజ్ కు శుభాకాంక్షలు అందాయి.

జపాన్ నుండి దాదాపు ఏభై మంది అభిమానులు.. చరణ్ కు మగధీర గ్రీటింగ్ కార్డ్స్ పై విషెస్ తెలుపుతూ.. చరణ్ కు పుట్టిన రోజు కానుకను పంపారు. అభిమానులు పంపిన ఆ గ్రీటింగ్స్ అందుకున్న రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘జపాన్ నుండి స్వీట్ సప్రైజ్ అందింది. మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’ అని పోస్ట్ చేశారు.

ఇక ప్రస్తుతం చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ లో అయిన గాయం నుండి కోలుకున్న చరణ్ త్వరలోనే మళ్లీ షూట్ కి సన్నద్ధం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :